ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ విన్నపం!
ప్రతేడాది డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పెద్ద పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు. రజనీ బర్త్ డే వేడుకలను పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేయాలని అభిమానులు తెగ ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరగడం లేదట. 66 వయసులోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. ఈ ఏడాది తన బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దని కోరారు. ఈ విషయాన్ని ఆయన మేజర్ రియాజ్ అహ్మద్ శుక్రవారం ట్వీట్ చేశారు.
తన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని రజనీకాంత్ కోరినట్టు ఆ ట్వీట్ సందేశం. అంతేకాక ప్రతేడాది రజనీ పుట్టినరోజున ఏర్పాటుచేసే పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లను నెలకొల్పవద్దని ఆయన కోరినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత మృతిచెందడంతో ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
No comments:
Post a Comment